బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన టెస్టు కెరీర్ ముగింపు దశకు చేరుకుందని ప్రకటించాడు. మిర్పూర్లో తన చివరి టెస్టు ఆడాలని ఉందని తెలిపాడు. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇప్పుడు భారత్తో రెండో టెస్టు మ్యాచే తన చివరి టెస్ట్ మ్యాచ్ అని వెల్లడించాడు. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.