»Sarve Palli Radhakrishnan Teachers Day Special Story
Teacher’s Day: ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్ స్టోరీ
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. గు అంటే చీకటి. రు అంటే తొలగించు అని అర్ధం. విద్యార్థి జీవితంలో చీకటిని పాలద్రోలి వెలును ప్రసాధింపజేసే స్థానం గురువుది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాద్యాయ దినోత్సవం జరుపుకుంటాము కదా.. దాని ప్రత్యేకతో ఏంటో తెలుసుకుందాం.
Sarve Palli Radhakrishnan, Teacher's Day Special Story
Teacher’s Day : “గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే.. గురువు లేని విద్యా గుడ్డి విద్యా అన్నారు పెద్దలు. మానవ జీవితంలో ఉపాధ్యాయుల(Teacher) పాత్ర ఎంతో విలువైనది. మనం మంచి దారిలో వెళ్లాలన్నా, జ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా ఎదగలాన్నా గురువులది జీవితంలో క్రియాశీలిక పాత్ర. ఉపాధ్యాయులు, గురువులు మన జీవితాలను తీర్చిదిద్దటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారిచ్చే సూచనలు, సలహాలు, బోధనలు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను అలవరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మన ఉపద్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. అది సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటామన్నా విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితులు , తత్వవేత్తలలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarve Palli Radhakrishnan) నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబరు 5, 1888న జన్మించారు. 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా.. 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అంతే కాదు 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అంతటి జ్ఙాని అయిన రాధాకృష్ణన్ అంకితభావానికి గుర్తుగా పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అదే విషయాన్ని విద్యార్ధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దానికి ఆయన స్పందిస్తూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన పుట్టినరోజును సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరపుకుంటారు. 1962 నుంచి కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది.
రాధాకృష్ణన్(Sarve Palli Radhakrishnan) ఒక గొప్ప తత్వవేత్తా, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు కూడా. రాధాకృష్ణన్ చికాగో, మైసూర్, కలకత్తా యూనివర్సిటీలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు విద్యార్థులు ఆకర్షితులయ్యేవారు. అందుకే ఆయనంటే స్టూడెంట్స్ ఎనలేని ప్రీతి. అలాగే మన జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రస్తుతం చదువుతున్న పిల్లలే కాదు, పూర్వ విద్యార్థులు కూడా వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి. అలాగూ పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. గురువులు మనకు చేసే సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గం. సెప్టెంబరు 5న మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్ రూపంలో అందిస్తారు. అనేక పాఠశాలలో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. గురువులను పూలమాలలతో సత్కరిస్తారు. నిజంగా విద్యార్థుల జీవితాల్లో అంధకారాన్ని తొలగించే సూర్యులు ఉపాధ్యాయులే. ఈ సందర్భంగా హిట్ టీవీ తరుపున అందరికి ఉపాద్యాయ శుభాకాంక్షలు.