నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత (AICC) మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కోమటిరెడ్డి తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పార్టీ తీరు, కార్యకలాపాలపై, నేతల అసంతృప్తిపై ఖర్గే ఆరా...
పాతబస్తీ ముస్లీంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఓ విజ్ఞప్తి చేశారు. పాతబస్తి ముస్లీంలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదని, వారికి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. పాతబస్తీకి మెట్రో లైన్ కోసం బీజేపీ దీక్ష చేస్తే అరెస్ట్ చేశారని, ఇది దారుణమన్నార...
ఇప్పుడు అంతా పాదయాత్రల కాలం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనవరి 26వ తేదీన పాదయాత్రను ప్రారంభించే అవకాశమున్నట్లు ఆ పార్టీ ఏపీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పాదయాత్ర ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ పాదయాత్ర ద్వారా తమ పార్టీలో పునరుత్తేజం తీసుకు వస్తామని, తిరిగి పుంజు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశాడు. పెన్షన్ పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించిన వారు.. పెన్షన్ విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62.31 లక్షల మంది పెన్...
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా… ఈ జోడో యాత్రలో ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ వెంటన నడిచారు. బుధవారం ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర...
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో… ఈ రోజు కేసీఆర్…తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ.. వైరస్ లాంటిదని… దానికి వైరస్ తమ బీజేపీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే వీఆర్ఎస్ అవుతుందన్నారు. కేసీఆర్ అండ్ టీమ్ దాదాగిరి...
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై రైడ్ చేసి..అందులోని సిబ్బందిని ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని చెప్పారు. రేవంత్...
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునిల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఎస్‌కే కార్యాలయం కంప్యూటర్, లాప్‌టాప్ లను పోలీసులు సీజ్ చేసారు. గత కొంతకాలంగా ఎస్‌కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. సోదాల సమయంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వ...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై రాద్దాంతం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడు, పదే పదే జనసేనానిని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారాహిని టార్గెట్ చేస్తోంది. పవన్ వాహనం ఆలివ్ గ్రీన్‌లో ఉందని, ఇదీ మిలటరీ రంగులా ఉందని, కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని వైసీపీ నేతలు మొదట చెప్పారు. కానీ అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తేలింది. అంతేకాదు, తెల...
లోకసభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి సభలో ప్రశ్నించారు. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి వచ్చిన వారికి హిందీ అంతగా రాదని, అలాగే, తనకు కూడా హిందీ అంతగా రాదని, ...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండానే, ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది. తాము బిల్లులోని ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అలాగే ఇప్పుడు సాధ్యం క...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. షర్మిల పాదయాత్రకు ఓకే చెప్పిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గతంలోని షరతులను గుర్తు చేసింది. ఈ షరతులకు అనుగుణంగా పాదయాత్ర ఉండాలని తెలిపింది. షర్మిల తరఫున అడ్వోకేట్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, మతపరమైన అ...
భారత రాష్ట్ర సమితితో (BRS) తాము దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను కూడా అవమానించేలా మాట్లాడాతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ చెడిపోయిందన్నారు. అంద...
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ, చెపాక్-తిరువల్లికేని ఎమ్మెల్యే ఉదయనిధి. అతను ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు. ఉదయనిధికి మంత్రి పదవి ఖాయమైంది. డిసెంబర్ 14న బుధవారం ఉదయం ఆయన రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయనిధికి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యువనేత విజయం సాధించారు. గతంలోనే ఆయనను మంత...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్...