తమిళనాడు అధికార పార్టీ డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ, చెపాక్-తిరువల్లికేని ఎమ్మెల్యే ఉదయనిధి. అతను ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు. ఉదయనిధికి మంత్రి పదవి ఖాయమైంది. డిసెంబర్ 14న బుధవారం ఉదయం ఆయన రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయనిధికి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యువనేత విజయం సాధించారు.
గతంలోనే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుందామని భావించినప్పటికీ, వారసత్వ రాజకీయాలపై చర్చ కొనసాగడంతో అప్పటికి నిలిచిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే వారసత్వం కొనసాగిస్తూ, మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉదయనిధికి యువజన, సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయనిధి సినీ నటుడు, ఫిల్మ్ మేకర్. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కరుణానిధి కుటుంబం నుండి నలుగురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్టాలిన్, ఉదయనిధితో పాటు లోకసభ ఎంపీలుగా కనిమొళి, దయానిధి మారన్ ఉన్నారు.