ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ కార్లను రీకాల్ ప్రకటించింది. ‘ఫ్యూయల్ పంప్లో సమస్య’ కారణంగా కంపెనీ ఈ రీకాల్ చేస్తుంది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా సమస్యను పరిష్కరించనుంది. 2024 నవంబర్ 5 నుంచి దేశమంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.