TG: హైదరాబాద్లో కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. కూకట్పల్లి నల్లచెరువులో నిర్మాణాలను కూల్చివేశామని తెలిపింది. అక్కడి నివాసాలను కూల్చివేయడం లేదని.. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలనే కూలుస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కాగా, నల్లచెరువులో నిర్మించిన అనధికార వ్యాపార భవనాలను కూల్చివేసి 4 ఎకరాల భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.