TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల విషయంలో వివక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ముత్యాలమ్మ గుడి దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడి వద్ద నిరసన చేపట్టినవారిపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమని వెల్లడించారు. హిందువుల పండగల విషయంలో అనేక నిర్భంధాలు విధిస్తున్నారని వెల్లడించారు.