AP: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ నుంచి ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందిస్తున్నామన్నారు. అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టంచేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే వాట్సాప్ నెంబర్ తీసుకువస్తామని నాదెండ్ల వెల్లడించారు.