ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో హమాస్ కొత్త అధినేత ఎవరనేదానిపై ఉత్కంఠకు తెర పడింది. సిన్వర్ స్థానాన్ని ఖాలెద్ మషాల్ భర్తీ చేయనున్నట్లు లెబనాన్‌కు చేసిన ఓ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. ఆయన విదేశాల్లో హమాస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇకపై గాజా కాల్పుల విరమణ చర్చల్లో మషాల్ పాల్గొననున్నట్లు వెల్లడించింది.