జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. ఓటర్లలో ప్రభుత్వం ఏర్పడదేమోనన్న సందేహాలకు తావులేకుండా ముందస్తు పొత్తు కుదుర్చుకున్నామని.. బీజేపీ మాత్రం హంగ్ అసెంబ్లీనే కోరుకుంటోందన్నారు.