AP: మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసుల్లో బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మద్దెల చెరువు సూరి హత్యకేసులో న్యాయస్థానం ఆయనకు జీవితఖైదు విధించింది. 12 ఏళ్లుగా చంచల్ గూడ జైలులో ఉంటున్న భాను కిరణ్కు బెయిల్ మంజూరైంది. కాగా.. జీవిత ఖైదు కేసు ఈ నెల 11న విచారణ జరగనుంది.