TG: సుప్రీం కోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్ధుల పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని వెల్లడించారు. ఏలాంటి ఆలోచనలు లేకుండా పరీక్షలు రాసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.