AP: సీఎం చంద్రబాబు మంత్రి సుభాష్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మంత్రి సుభాష్.. ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అలసత్వంపై చంద్రబాబు నన్ను హెచ్చరించారు. అందులో మంచిని తీసుకుని పనితీరుని మెరుగుపరుచుకుంటాను. నేను గతంలో వార్డు మెంబర్, కౌన్సిలర్ కూడా కాదు. అలాంటి నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తాను’ అని తెలిపారు.