AP: నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ఇవాళ అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, కొత్త పాలసీలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలలో అమలు చేసే అంశంతో పాటు కీ ఇండికేటర్స్, విజన్ డాక్యుమెంట్ 2047పై చర్చించే అవకాశం ఉంది.