తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ సింగింగ్ షోకి సపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. ఈ ప్రోగ్రాం త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. ఇప్పటికే 23 సీజన్లు పూర్తి చేసుకొని 24వ సీజన్‌లోని అడుగుపెట్టనుంది. తెలుగులో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోనున్న ఫస్ట్ టీవీ షోగా ‘పాడుతా తీయగా’ నిలవనుంది. 1996 నుంచి 2020 వరకు దీనికి దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్‌గా వ్యవహరించారు.