AP: పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 2+2 సెక్యూరిటీ స్థానంలో Y కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచడం అత్యవసరమని కాంగ్రెస్ నేతలు కోరారు.