AP: అలిపిరి ఘటనలో తనను దేవుడే కాపాడాడని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటానని తెలిపారు. ‘శీనివాసుడే నాకు పునర్జన్మ ప్రసాదించాడు. తిరుమల శీవారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో వైఎస్ రాజశేకర్ రెడ్డి ఏడుకొండలను రెండు కొండలు అన్నారు. అప్పట్లో కూడా నేను దాన్ని తీవ్రంగా ఖండించాను. పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నాను’ అని తెలిపారు.