AP: అధికారం చేజారిన తర్వాత YCPకి నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజీనామా చేయనున్నట్లు సమాచారం. జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇస్తారని పద్మ భావించినా.. తన్నీరు నాగేశ్వరరావును జగన్ ఇంఛార్జ్‌గా నియమించడంతో మనస్తాపానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.