AP: విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అటవీశాఖ అధికారి వేణురెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల విచారణ అనంతరం వేణురెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పత్తాలేకుండా పోయాడు. జాయ్ జమీమా, వేణురెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వేణురెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.