TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ ERCకి మాజీమంత్రి KTR వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ‘రూ.18,500కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఉచిత విద్యుత్ అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఉన్న విద్యుత్‌ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తోంది. వెంటనే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.