జమిలి ఎన్నికలపై జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జమిలీ ఎన్నికలను సరైన ఉద్దేశంతో నిర్వహిస్తే.. అందులో తప్పు లేదని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే త్వరగా అన్ని ఎన్నికలను కలిపి నిర్వహించాలనే ఉద్దేశంతో చేస్తుంటే మాత్రం తగదని వ్యాఖ్యానించారు.