వంగవీటి రాధా ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు టీడీపీ అధిష్టానం కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో రాధాకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.. అయిన కూడా పార్టీ కోసం క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తగిన గుర్తింపును ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇటీవల రాధా ఇంటికి మంత్రి లోకేశ్ వెళ్లడంతో.. ఆయనకు MLC పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది.