TG: హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై కేంద్రం కూడా ఆగ్రహంగా ఉందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలు సెక్యులర్‌గా ఉండాలని.. కుల, మత, ప్రాంత భేదాలు చూడొద్దని అన్నారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని కోరారు.