AP: తిరుమల లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. ఇది కేవలం తప్పు కాదని, భక్తుల మనోభావాలను అవమానించడమంటూ ట్వీట్ చేశాడు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి దోషులను గుర్తించాలి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసుకొచ్చాడు.