TG: ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌తో యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా సీఎం రేవంత్ మాదిగలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం ఉందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు.