AP: రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. TDP, YCP మధ్య వరుస ట్వీట్లు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘BIG EXPOSE’ అంటూ టీడీపీ మొదటగా ట్వీట్ చేసింది. ఆ తర్వాత వైసీపీ కూడా ‘X’ వేదికగా ‘TRUTH BOMB DROPPING’ అని పోస్టు పెట్టింది. అందుకు సంబంధించి ‘ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్’ అనే పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో అసలు రేపు పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.