AP: విశాఖ నుంచి విజయవాడకు రేపటి నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడవనున్నాయి. విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7:15కు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 8:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:50 గంటలకు వస్తుంది. అలాగే, ఎయిర్ ఇండియా సర్వీస్ ఉదయం 9:35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10:35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖకు వస్తుంది.