TG: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేయనున్నారు. రేపు పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని నిర్ణయించగా.. నవంబరు 23న ‘ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష’ పేరిట చలో ఇందిరాపార్క్‌కు సంఘం పిలుపునిచ్చింది.