AP: వైసీపీ హయాంలో అక్కాచెల్లెమ్మలకు భద్రత ఉండేదని మాజీ సీఎం జగన్ అన్నారు. యువకుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు GGHలో చికిత్స పొందుతూ మరణించిన సహానా కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ‘మా ప్రభుత్వ హయాంలో సమస్య ఉందని ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వచ్చేవారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. సహానా కేసులో నిందితుడు నవీన్ టీడీపీతో సన్నిహితంగా ఉండేవాడు’ అని తెలిపారు.