రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి, సామర్థ్యాలు ప్రధాని మోదీకి ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ‘మోదీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భారత్కు రష్యా సరఫరా చేస్తున్న ఇంధన కొనుగోళ్లను ఆపడం ద్వారా మోదీ.. రష్యా దూకుడుకు కళ్లెం వేయొచ్చు’ అని పేర్కొన్నారు. అయితే తమ దేశంపై యుద్ధం జరుగుతున్న కారణంగా ప్రత్యర్థితో చర్చలు జరపడం ఎంతో కీలకమని, ఇందుకు భారత్ వేదిక కావొచ్చని అభిప్రాయపడ్డారు.