చేదుగా ఉంటుందని కాకరకాయ తినటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ కూరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దరిచేరనీయదు. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. కాలేయం శుభ్రపడుతుంది. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఇందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.