నేటి యువత రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామాల్లో అసెంబ్లీలో జరిగే విషయాలపై చర్చ జరగడం లేదన్నారు. సోషల్ మీడియాలో కొంత మంచి కొంత చెడు జరుగుతుందని, సమాచారాన్ని ఆయుధంగా వాడటం లేదన్నారు. ప్రచార సాధనాలకు, పత్రికలకు స్వేచ్ఛ నిజాయితీ ఉండాలని అన్నారు. అందుకే నేటి యువతకు అవగాహన కల్పించడానికి విద్యార్థులతో కాలేజీలకు వెళ్లి మాట్లాడుతున్నానని తెలిపారు.