TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను సర్కారు రద్దు చేసింది. మెఘా ఇంజినీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంజినీరింగ్ విభాగం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానున్నట్లు తెలుస్తోంది.