AP: విజయనగరం జిల్లాలోని గుర్ల ఘటన బాధ కలిగించిందని Dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. డయేరియాతో 10 మంది చనిపోయారని గ్రామస్థులు చెప్పారన్న పవన్.. ఎంత మంది చనిపోయారనేది ప్రభుత్వ పరిశీలనలో తేలుతుందన్నారు. మృతుల కుటుంబాలకు తన వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున అందిస్తానన్నారు. గుర్లలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. గత YCP ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధులను పక్క దారి పట్టించడం వల్లే పారిశుద్ధ్య లోపం తలెత్తిందన్నారు.