TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ మేరకు మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదల కోసం మూసీ దగ్గర ఉండేందుకు సిద్ధమని పేర్కొన్నారు. మూసీ పక్కనున్న దేవాలయాలను కూల్చే దమ్ము సీఎంకి ఉందా అని ప్రశ్నించారు. మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రోస్టేషన్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. పేదలపై ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారని మండిపడ్డారు.