AP: బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో అరెస్ట్ చేశామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఇవాళ అర్థరాత్రికి విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చి రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని.. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. ఇక జెత్వానీకి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు.