AP: వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు షాక్ తగిలింది. ఆయనపై విజయవాడకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని తాడేపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.