AP: శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ప్రభావంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్కు బయలుదేరిన అప్పలరాజును పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటి వద్దనే అధికార పార్టీ దౌర్జన్యం నశించాలంటూ.. నినాదాలు చేశారు.