రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడంలో బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.