AP: రాయలసీమలో మహిళలకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి లోకేశ్‌కు మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు స్థిరమైన అభివృద్ధి కల్పించడంపై సీఎం చంద్రబాబు స్ఫూర్తితో దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించిన జేఎన్టీయూ రూపొందించిన సమగ్ర నివేదికను లేఖకు జత చేశారు.