పిజ్జా, బర్గర్, మెమోస్తో పాటు ఇచ్చే మయొనైజ్ విషతుల్యం కావటంతో ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. ఈ క్రమంలో మయొనైజ్కి ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవకాడో గుజ్జు.. శెనగలు, వెల్లుల్లి, తెల్ల నువ్వుల పొడితో చేసే క్రీమ్ వాడుకోవచ్చు. పైన్ నట్స్, చీజ్, ఆలివ్ నూనెతో చేసే క్రీమ్.. గ్రీక్ యోగర్డ్, పీనట్ బటర్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి రుచితో పాటు ఆరోగ్యకరం కూడా.