➢ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి ➢ ఆకుకూరలు ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు నరాల చుట్టూ మైలిన్ అనే రక్షణ కవచం ఏర్పడటంలో సహకరిస్తాయి ➢ ఆహారంలో బచ్చలికూర, క్యాబేజీ, ఓట్స్, గోధుమలు, చిలగడదుంపలు, నారింజ, కివీ, సాల్మన్ చేప ఎక్కువ తీసుకోవాలి ➢ ఆహార పదార్థాల తయారీలో పసుపు ఉండేలా చూసుకోవాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.