అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. అయితే ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి హెచ్1బీ వీసాలు కఠినతరం కానున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారిపై ఆశలపై నీళ్లు చల్లినట్లే. కానీ, ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ అనుకూలంగా ఉంటారని నిపుణులంటున్నారు.