భారత్-చైనాల మధ్య కుదిరిన కీలక గస్తీ ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పరస్పర భద్రత సూత్రం ఆధారంగా ఇరుదేశాల మధ్య సరిహద్దు పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారత్- చైనా మధ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. పెట్రోలింగ్, కీలక ప్రాంతాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఒప్పందంలో స్పష్టంగా ఉందని తెలిపారు. చర్చలకు ఉండే శక్తి ఇదేనని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.