ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని.. ఈ కారణం చేతనే నంబియార్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు నంబియార్ అల్లుడు, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు.