TG: రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా మారాయని కూనంనేని సాంబశివరావు అన్నారు. దీనికి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందని.. హామీలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.