బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంటున్న గంగవ్వ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గంగవ్వ ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అవ్వబోతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవలే గంగవ్వపై జంతు హింసపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కారణంగానే నిర్వాహకులు గంగవ్వని ఎలిమినేట్ చేసి బయటికి పంపించారని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.