TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మాజీమంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు నష్టం కలిగించేలా సంజయ్ వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరించారు. కాగా.. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.