TG: కుల గణనపై ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. కుల గణన కోసం రూ.150 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఛైర్మన్, సభ్యులను కూడా నియమించామని తెలిపారు. ఈనెల 30లోపు సమాచార సేకరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 6వ తేదీన సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు.