»%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81 %e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82 Good News
TG: అమరులైన కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన ఎస్ఐ, సీఐ కుటుంబాలకు రూ.1.25 కోట్లు.. అమరులైన డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.1.50 కోట్లు, అమరులైన ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్లు పరిహారంగా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.